Header Banner

డిగ్రీ అర్హతతో యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగావకాశాలు! ఎంపికైతే నెలకు రూ.85 వేల జీతం!

  Fri May 02, 2025 17:09        Employment

ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యూనియన్‌ బ్యాంక్‌.. దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్‌ (క్రెడిట్‌) పోస్టులు 250, అసిస్టెంట్ మేనేజర్‌ (ఐటీ) 250 వరకు ఉన్నాయి. మే 20వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్‌ లేదా బీఈ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్‌, ఎంబీఏ లేదా పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఏడాది పాటు పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2025వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 20, 2025వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..

రాత పరీక్ష మత్తం 150 ప్రశ్నలకు 225 మార్కులకు ఉంటుంది. పార్ట్‌ 1లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్‌లో 25 మార్కులకు 25 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌కు 25 మార్కులకు 25 ప్రశ్నలు.. ఇలా 75 మార్కులకు ఉంటుంది. ఇక పార్ట్ 2లో 150 మార్కులకు సంబంధిత పోస్టుకు చెందిన ప్రొఫెషనల్ నాలెడ్జ్‌లో పరీక్ష ఉంటుంది. మొత్తం 150 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. గ్రూప్‌ డిస్కషన్‌కు 50 మార్కులకు ఉంటుంది. ఇందులో కనీసం 25 మార్కులు తెచ్చుకోవల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #UnionBankJobs #BankRecruitment2025 #SpecialistOfficerJobs #DegreeJobs #BankingCareers #UnionBankNotification